VIDEO: గోదాదేవి అమ్మవారికి మహా నైవేద్యం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పాండు చెరువుకట్ట శ్రీ కళ్యాణ సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు భక్తుల సహకారంతో శనివారం గోదాదేవి అమ్మవారికి 108 కళశాలలో మహా నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ ఆదివారం గోదాదేవి కళ్యాణం పురస్కరించుకొని నేడు మహా నైవేద్యం సమర్పించామన్నారు.