పరకామణి కేసులో ముగియనున్న విచారణ
AP: టీటీడీ పరకామణి కేసులో ఇవాళ్టితో విచారణ ముగియనుంది. రేపు సీఐడీ అధికారులు విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నారు. విచారణాధికారిగా సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌ను హైకోర్టు నియమించింది. కాగా, హైకోర్టు ఆదేశంతో పరకామణి కేసులో సీఐడీ అధికారులు అక్టోబర్ 27న విచారణ చేపట్టారు.