'పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

'పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

KDP: వేంపల్లె మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పంచాయతీ రాజ్ డీఈ సుధాకర్ రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్‌కి ఆదేశించారు. బుధవారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జడ్పీ నిధుల కింద రూ. 10 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.