VIDEO: కుమార్తె ఆచూకీ కోసం తండ్రి ఆవేదన
కోనసీమ: తన బిడ్డను వెతికి పెట్టాలని ఓ తండ్రి కలెక్టర్‌ను వేడుకున్నాడు. అల్లవరం మండలం గోడితిప్పకు చెందిన వనమాడి నాగరాజు తన కుమార్తె గత సంవత్సరం అక్టోబర్ 19 నుంచి కనిపించకుండా పోయినా పోలీసులు ఆచూకీ మాత్రం కనుగొనలేదని ఆవేదన చెందాడు. తన సోదరి ఆచూకీ కోసం నాలుగు నెలల నుంచి తిరుగుతున్నామని,ఇప్పటికీ ఆచూకీ లభించలేదని, వెతికి పెట్టాలని ఆమె సోదరుడు సురేష్ కోరారు.