మోటార్ సైకిళ్ల దొంగ అరెస్ట్

మోటార్ సైకిళ్ల దొంగ అరెస్ట్

కృష్ణా: కృత్తివెన్ను మండలం యండపల్లి గ్రామానికి చెందిన కూనసాని నాగాంజనేయులు, ఆకివీడు మండలం చినకాపవరానికి చెందిన కుప్పల రమేశ్‌లు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడగా, ఆకివీడు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ వి.జగదీశ్వరరావు గురువారం వివరాలు వెల్లడిస్తూ, నిందితుల నుంచి తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్లు తెలిపారు.