నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి: ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతు పనులు చేపడుతున్న కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మండలంలోని బసవపాడు, లింగరాజుపాలెం, జేవీ.పాలెం తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.