పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
W.G: నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ ఎం. సుధాకర్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, స్టేషన్ పరిధిలోని క్రైమ్ వివరాలను సీఐ బి. యాదగిరిని అడిగి తెలుసుకున్నారు.స్టేషన్‌లో ఎలాంటి కేసులు పెండింగ్‌లో ఉండకూడదని, వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు.