VIDEO: రోడ్డుపై బైఠాయించిన రైతులు

SRCL: వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ కోనరావుపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రభుత్వం ఇస్తానన్న మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుకి ఇరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.