VIDEO: యూరియా కోసం రైతులు ఆందోళన

WGL: ఖానాపురం మండలం బుధరావుపేట సోసైటి ముందు సోమవారం నాజీ తండాతో పాటు పలువురు రైతులు, మహిళలు కలిసి నర్సంపేట మహబుబాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. వర్షాలు పడి మొక్కలు మెలకెత్తినపట్టికి రైతులకు యూరియా అందుబాటులో ఉంచడం లేదన్నారు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి, రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.