పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యూనిటీ'
GDWL: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, గద్వాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ టి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఐక్యతతో దేనినైనా సాధించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తదితర పోలీస్ అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.