విద్యార్థులకు GOOD NEWS.. ప్రయాణం ఉచితం
ప్రకాశం: పొదిలిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంస్థ అనుమతించినట్లు డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు. రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో, ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కండక్టర్‌కు హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని తెలిపారు.