VIDEO: ముమ్మిడివరంలో కురుస్తున్న వర్షం

కోనసీమ: ముమ్మిడివరం మండలంలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు వర్షంలో తడుచుకుంటూనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు రద్దీ ఎక్కువగానే ఉంది. ఈ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.