శాస్త్రోక్తంగా ఆలయ రాజగోపురం నిర్మాణ పనులు
కోనసీమ: ఆత్రేయపురం(M) ర్యాలిలో వేచియున్న శ్రీ జగన్మోహిని, కేశవ గోపాల స్వామి వారి దేవస్థానం క్షేత్రపాలకులు శ్రీ గోపాల స్వామి వారి ఆలయ రాజగోపురం నిర్మాణ పూజలు ప్రారంభమయ్యాయి. విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం, వాస్తు పూజ, శంఖువు అభిషేకం, వాస్తు హోమం, అనంతరం శంఖుస్థాపన, మహా శాంతి హోమాలు, పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఈవో, భక్తులు ఉన్నారు.