రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
TPT: రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుల్లెట్ బైక్‌ను ఢీకొట్టింది. బైకుపై ఉన్న యువకుడు తీవ్రంగా గాయపడడంతో 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.