బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

SRD: నారాయణఖేడ్‌ మండలం జుజాల్పూర్‌ గ్రామానికి చెందిన అశోక్‌ రెడ్డి(40) గురువారం ఉదయం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి నారాయణఖేడ్‌ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.