మూవీ టికెట్లు, ఫుడ్ ఐటమ్స్ రేట్లపై తిరుగుబాటు

మూవీ టికెట్లు, ఫుడ్ ఐటమ్స్ రేట్లపై తిరుగుబాటు

థియేటర్లు, ఫుడ్‌కోట్స్ దోపిడీ కేంద్రాలుగా మారుతున్న నేపథ్యంలో యువత తిరుగుబాటుకు దిగింది. సినిమా టికెట్లు, ఫుడ్ ఐటమ్స్ రేట్లతో పాటు పార్కింగ్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్(PYL) పేరుతో కొందరు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తోంది.