ట్రాక్టర్‌పై నుంచి పడి బాలుడి మృతి

ట్రాక్టర్‌పై నుంచి పడి బాలుడి మృతి

MLG: ట్రాక్టర్ ట్రాలీపై నుంచి కిందపడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తాడ్వాయి మండలంలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. ఊరట్టంలో పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్ వద్ద ఆడుకుంటున్న క్రమంలో మహేశ్ ట్రాలీ పైకెక్కాడు. ఈ క్రమంలో జారి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి పరిస్థితి విషమం కాగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.