VIDEO: వైభవంగా రాజగోపుర శిఖర ప్రతిష్ట.!
RR: శేరిలింగంపల్లిలోని హుడా ట్రేడ్ సెంటర్ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో రాజగోపుర శిఖర ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో MLA గాంధీ, మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.