శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

HYD: కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని రామాలయంలో రేపు శ్రీరామనవమిని పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వయంగా పరిశీలించారు. అక్కడికి చేరుకున్న ఆయన ఆలయం పరిసర ప్రాంతాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. రామాలయంలో ప్రతి ఏటా లాగే ఈసారి కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.