రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: నెల్లిమర్ల మండలం సతివాడ సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. త్రినాధరావు మంగళవారం తెలిపారు. అలుగోలు రూరల్ ఫీడర్‌లో చెట్టు కొమ్మలు తొలగింపు, పాత కండక్టర్ మార్పు పనులు చేపట్టనున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.