అంతరించిపోతున్న పల్లె సంస్కృతులు

అంతరించిపోతున్న పల్లె సంస్కృతులు

కృష్ణా: జిల్లాలో వేసవి ప్రారంభమైతే గ్రామాల్లో పిల్లలు చెట్ల నీడలో అష్టచమ్మ, కోతికొమ్మ వంటి ఆటలతో ఆనందంగా గడిపే రోజులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్లు బిజీ జీవన శైలితో పల్లె సంస్కృతి క్రమంగా తగ్గిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని కష్టసుఖాలు పాలుపంచుకునేవారు. ఇప్పుడు అది లేదని చింతిస్తున్నారు.