VIDEO: ధరణి, భూభారతి డిజిటల్ ఫ్రాడ్: 15 మంది అరెస్ట్
WGL: జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో రూ. 3.90 కోట్ల డిజిటల్ ఫ్రాడ్ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మరో 9మంది పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 63.19 లక్షల నగదు, రూ. 1కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.