VIDEO: యాదగిరిగుట్టలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోని ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వైష్ణవ క్షేత్రాలలో ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయమని అర్చకులు తెలిపారు. 30 రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. బుధవారం రెండో రోజు పాశుర పఠనం చేస్తూ ప్రధాన పూజారి కాండూరీ వెంకటాచార్యులు విశిష్టతను వివరించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.