VIDEO: ఎమ్మెల్యే కృషి.. 40 ఏళ్లకు రోడ్డు నిర్మాణం
KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో ఎట్టకేలకు 40 ఏళ్లకు రోడ్డు నిర్మించబడిందని మెట్ట చింత, ఉలి గోగుల గ్రామాల గిరిజనులు తెలిపారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు రోడ్డుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 ఏళ్లుగా ఈ రహదారి సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని పేర్కొన్నారు.