పరిటాల సునీత ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

పరిటాల సునీత ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

ATP: రాప్తాడు MLA పరిటాల సునీత వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపగా.. మరికొన్నింటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు.