రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ ఫామ్‌పై బుధవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం అయింది. స్థానిక రైల్వే అధికారుల సమాచారం మేరకు బాపట్ల రైల్వే ఎస్సై ఎల్. సరస్వతి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 55 - 60 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు.