'13న లోక్ అదాలత్...సద్వినియోగం చేసుకోండి'

KMM: ఈ నెల 13న మదిర కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఉంటుందని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. ఏమైనా కేసులున్న వారు ఈ లోక్ అధాలత్‌లో రాజీ చేసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుడు, నేరస్తుడు ఆధార్ కార్డు తీసుకొని మధిర కోర్టుకు రావాలని ఎస్సై సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.