ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు DHMO
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ సామజిక ఆసుపత్రిని శుక్రవారం అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ తనిఖీ చేశారు. అనంతరం సిబ్బంది రికార్డులను పరిశీలించారు. గర్భిణీ, బాలింతలకు తగిన చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.