మహిళను వేధించిన నిందితుడికి జైలు శిక్ష
కాకినాడ: కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితను వేధించిన కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధించిందని SI రామకృష్ణ సోమవారం తెలిపారు. 2024లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన తుని కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు యేలేటి రాజుకు రెండున్నరేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.