జూలపల్లి మండల వాసికి డాక్టరేట్

PDPL: అమెరికా దేశానికి చెందిన ప్రఖ్యాత విర్చువల్ యూనివర్సిటీ అయిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల వాస్తవ్యులు మారం తిరుపతి యాదవ్‌కు డాక్టరేట్ ప్రధానం చేశారు. రాష్ట్రంలో గొర్రెల కాపరుల స్థితిగతులు, ఆర్థిక ఎదుగుదల, మాంస ఉత్పత్తిలో నూతన పద్ధతులపై గత 12 సంవత్సరాల నుంచి పరిశోధన, అధ్యయనం చేయడం పట్ల పట్టా అందించినట్లు తెలిపారు.