'హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి'
KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లిలో ఈ నెల 26న జరగనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సర్పంచులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన, 'హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప దాటితే హిందువులం' అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.