సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

కోనసీమ: మామిడికుదురు (మం) లూటుకుర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద సీసీ రహదారి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ అడబాల తాతకాపు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవతో రూ. 3 లక్షల వ్యయంతో సీసీ రహదారి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.