కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు

ATP: ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆషాడ మాసం మొదటి మంగళవారం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో మూలవిరాట్ కన్యకా పరమేశ్వరి దేవికి వివిధ ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.