ఈ నెల 20న పుంగనూరు స్వామివారి పరుష వేలం
CTR: పుంగనూరు శ్రీమాణిక్య వరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాటను ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం తెలిపారు. స్వామివారి పశువుల పరుష కోసం ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆలయంలో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనేవారు రూ.10 వేలు ధరావత్తు చెల్లించాలని కోరారు. ఏటా నిర్వహించే రీతిలోనే ఈసారి కూడా పరుషను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.