మైమరిపించిన కళాకారుల నృత్య ప్రదర్శన

మైమరిపించిన కళాకారుల నృత్య ప్రదర్శన

HYD: వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను అబ్బురుపరిచాయి. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్రభారతిలో నృత్యాంగణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కోల్‌కత్తా, ఒడిశా, ఏపీతోపాటు దుబాయ్, కెనడా దేశాలకు చెందిన కళాకారులు తమ నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. పర్యాటక శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.