VIDEO: ప్రతిపక్షాల సెటైర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం
మార్కాపురం జిల్లా ఇస్తే కొంత మంది నాయకులు సెటైర్లు వేశారని ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఓడించిన ప్రజలు మళ్ళీ ఆదరించి గెలిపించారన్నారు. అందుకు ప్రతిఫలంగా తాను జిల్లాను సాధించానని చెప్పారు. అందరం కలిసి విభేదాలు పక్కన పెట్టి నియోజకవర్గాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.