'అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి'

'అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి'

SRPT: అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు అన్నారు. ఇవాళ మేళ్లచెర్వు మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో రాజేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు గుండు సైదులు, బద్దుల సైదులు, మేడిపల్లి అశోక్, శంకర్ వెంకటేష్ పాల్గొన్నారు.