గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

PDPL: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను తనిఖీ చేసి, నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 35 గేట్ల ద్వారా దిగువకు వరద విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ దిగువన గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.