ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో

ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో

ASR: చింతపల్లి మండలం వంగసార బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం సాయంత్రం ఐటీడీఏ పీవో శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలతో ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటశాల, భోజనశాలను పరిశీలించారు. వంటశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. పిల్లల భోజనం నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.