నీట్‌కు 3,320 మంది అభ్యర్థులు: కలెక్టర్

SRD: ఈనెల 4వ తేదీన ఏడు కేంద్రాల్లో జరిగే నీట్ పరీక్షకు 3,320 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు.