VIDEO: బాల్క సుమన్‌ను పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించడానికి మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బయలుదేరారు. ఆయనతోపాటు మాజీ మంత్రి జోగు రామన్న, MLA అనిల్ జాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు తగిన బుద్ధి చెప్తారని KTR హెచ్చరించారు.