సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక
KNR: జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన సీఐటీయూ జిల్లా 11వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉప్పునీటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గిట్ల ముకుంద రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.