'గుడుంబా నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవాలి'

'గుడుంబా నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవాలి'

WGL: రేగొండ మండలం తిరుమలగిరితో పాటు పలు గ్రామాల్లో గుడుంబా విక్రయాలు తీవ్రంగా సాగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి స్వయంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామాల్లో గుడుంబా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఉన్నత అధికారులు స్పందించి గుడుంబా స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.