కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
VSP: నగర సీపీ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గోపాలపట్నం పోలీసులు ఇవాళ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి, సరైన ధృవపత్రాలు లేని 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.