హెచ్ఎంపై అధికారులకు ఫిర్యాదు

NLG: చిట్యాల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి పాఠశాలకు మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ మాజీ పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ, బీఎస్పీ నాయకులు గ్యార శేఖర్‌లు మంగళవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీచర్లపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని వారు ఆరోపించారు.