జిల్లాలో పిడుగుల బీభత్సం..
PLD: జిల్లాలో ఇవాళ భీకర వర్షం కురిసింది. సత్తెనపల్లి మండలం కట్టవారిపాలెంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి సురేష్ అనే వలస కూలీ మృతి చెందాడు. అటు పెదకూరపాడు (M) గారపాడులో పిడుగు పడి నాగమల్లేశ్వరరావుకు చెందిన 14 గొర్రెలు మృతి చెందాయి. పెదకూరపాడు (M) లగడపాడులో ఏసుబాబుకు చెందిన ఓ గేదె చనిపోయింది. అధికారులు ఘటనా స్థలాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు.