VIDEO: ఆటో బోల్తా..పలువురికి గాయాలు..!
KDP: అట్లూరు మండలం లింగాలకుంట క్రాస్ వద్ద ఇవాళ సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. టైరు పేలి ఆటో బోల్తా పడి ఆటోలో ఉన్న పది మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. ఆ సమయంలో కడపకు వెళ్తూ ప్రమాదాన్ని గుర్తించిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి తన వాహనంలో క్షతగాత్రులను హుటాహుటిన బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.