నాటుసారాయి పట్టివేత.. వ్యక్తి అరెస్ట్
BDK: భద్రాచలం కొత్త మార్కెట్ సమీపంలోని భగవాన్ దాస్ కాలనీలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం వాహన తనిఖీలు నిర్వహించి 16 లీటర్ల నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వేముల వెంకన్నను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌతమ్ తెలిపారు. నాటుసారాయి తరలింపుకు ఉపయోగించిన టీవీఎస్ జూపిటర్ బైక్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.