'ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి'
SRCL: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను శాంతియుత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయా ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.