‘ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి’

‘ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి’

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. AQI సగటున 298 పాయింట్లు నమోదవ్వడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ విజయ్ కుమార్ స్పందించారు. ఢిల్లీలో వెంటనే 'హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణకు కేంద్రం తక్షణం 'నేషనల్ క్లీన్ ఎయిర్ ప్లాన్'ను ప్రారంభించాలని కోరారు.